సీఐ వేధింపులకు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.. వీడియో ఇదిగో!
- కొత్తగూడెం ఎక్సైజ్ సీఐపై బాధితురాలి కుటుంబం ఆరోపణలు
- ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన బాధితురాలి కుటుంబం
- మద్దతు తెలిపిన మిగతా కానిస్టేబుళ్లు, ఎస్ఐ
కానిస్టేబుల్ ఆందోళనంతా ఓ డ్రామా అని కొట్టిపారేశారు. తనపై తిరగబడిన వారందరి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటానని సీఐ బెదిరింపులకు దిగారు. కాగా, బాధిత మహిళా కానిస్టేబుల్ తో పాటు మిగతా సిబ్బంది అంతా కలిసి వెళ్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు సీఐపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్టేషన్ సిబ్బంది మధ్య గొడవలు పెట్టి సీఐ వేధింపులకు పాల్పడుతోందని, సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.