Kishtwar encounter: ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టిన సైన్యం.. కశ్మీర్ లో కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఛత్రు’

Kishtwar Encounter Army surrounds terrorist hideout in Kashmir
  • కిష్తివాడ్ లో కొనసాగుతున్న భీకర కాల్పులు
  • ఈ రోజు తెల్లవారుజామున భద్రతాబలగాల సెర్చ్ ఆపరేషన్
  • కశ్మీర్ పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టిన సైన్యం
జమ్మూకశ్మీర్ లోని కిష్తివాడ్ లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల హైడవుట్ పై నిఘా వర్గాల సమాచారం మేరకు సైనిక బలగాలు ఈ రోజు ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ముగ్గురు ఉగ్రవాదులు నెలల తరబడి తిష్ట వేసిన ఇంటిని చుట్టుముట్టాయి. ‘ఆపరేషన్ ఛత్రు’ పేరుతో కశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది.

భద్రతాబలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. సైన్యం ఎదురు కాల్పులు జరుపుతోంది. భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కశ్మీర్ పోలీసు బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.
Kishtwar encounter
Jammu Kashmir
Chatru operation
Indian Army
White Knight Corps
Kashmir Police
Terrorists
Hideout
Security forces
Encounter

More Telugu News