Telangana Human Rights Commission: చేవెళ్ల బస్సు ప్రమాదం.. సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

Telangana Human Rights Commission Takes Suo Moto Cognizance of Chevella Bus Accident
  • డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ఆదేశం
  • రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు
  • నివేదిక పంపాలని కలెక్టర్, ఆర్టీసీ ఎండీలకు కూడా ఆదేశం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద కంకర లోడుతో వస్తున్న టిప్పర్... బస్సును ఢీకొనడంతో 19 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, డిసెంబర్ 15వ తేదీలోపు సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది.

ఈ మేరకు రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలను సైతం నివేదిక పంపాలని ఆదేశించింది. ప్రమాద సమయంలో ట్రక్కులోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక వారు మృతి చెందారు.
Telangana Human Rights Commission
Chevella bus accident
Rangareddy district
Road accident Telangana

More Telugu News