Bharati Travels: మరో బస్సు ప్రమాదం.. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా

Bharati Travels Bus Overturns Near Eluru Two Dead
  • ఏలూరు జిల్లా లింగంపాలెం సమీపంలో బోల్తా పడిన బస్సు
  • ఇద్దరు మృతి, 13 మందికి గాయాలు
  • క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలింపు
నిన్న కర్నూలు, నేడు చేవెళ్ల బస్సు ప్రమాదాల విషాదం మరవకముందే, ఏలూరు వద్ద మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భారతి ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా లింగంపాలెం సమీపంలోని జూబ్లీనగర్ వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Bharati Travels
Bharati Travels bus accident
Eluru bus accident
Lingapalem
Jubilee Nagar
Hyderabad bus

More Telugu News