Shefali Verma: సచిన్‌తో మాట్లాడిన తర్వాత కొత్త ఉత్సాహం వచ్చింది: వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మ

Shefali Verma Inspired After Talking With Sachin Tendulkar
  • మ్యాచ్‌కు కొన్ని సెకన్ల ముందు సచిన్‌తో మాట్లాడానన్న షెఫాలీ వర్మ
  • సచిన్ టెండుల్కర్ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారన్న షెఫాలీ వర్మ
  • మ్యాచ్‌కతు ముందు సచిన్‌ను చూడగానే ప్రత్యేకంగా ఏదైనా సాధించగలననే నమ్మకం వచ్చిందని వ్యాఖ్య
ఫైనల్ మ్యాచ్‌కు ముందు సచిన్ టెండుల్కర్‌తో మాట్లాడానని, ఆయనతో మాట్లాడిన తర్వాత తనకు తెలియని కొత్త ఉత్సాహం వచ్చిందని ఐసీసీ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఓపెనర్ షెఫాలీ వర్మ వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. వందకు పైగా స్ట్రైక్ రేటుతో 87 పరుగులు చేసి బ్యాటింగ్‌లో రాణించింది. బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీసి ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

కప్ గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ, మ్యాచ్‌కు కొన్ని క్షణాల ముందు సచిన్‌తో తాను మాట్లాడిన మాటలతో అంతా మారిపోయిందని తెలిపింది. టెండుల్కర్‌ను చూడగానే తనకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చిందని, ఆయన తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని పేర్కొంది. మాస్టర్‌ను చూస్తే స్ఫూర్తి కలుగుతుందని తెలిపింది. ఈ విజయం ద్వారా కలిగిన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలమని తనకు అర్థమైందని, ఎలాంటి గందరగోళం లేకుండా ఆటపై మాత్రమే దృష్టి సారించానని ఆమె తెలిపింది. జట్టులోని ప్రతి ఒక్కరు తనను ప్రోత్సహించారని వెల్లడించింది. ఏమీ ఆలోచించకుండా తన ఆట తాను ఆడుకోవాలని చెప్పారని గుర్తు చేసుకున్నది. మ్యాచ్‌కు ముందు సచిన్ సర్‌ను చూడగానే తాను ప్రత్యేకంగా ఏదైనా సాధించగలననే నమ్మకం కలిగిందని ధీమా వ్యక్తం చేసింది.

ఢిల్లీ క్రికెటర్ ప్రతీక్ రావల్ గాయపడటంతో హర్యానాకు 21 ఏళ్ల చెందిన షెఫాలీ వర్మ అనూహ్యంగా జట్టులోకి వచ్చింది. సెమీస్‌లో అంతగా రాణించలేదు. ఫైనల్‌లో మాత్రం బ్యాట్, బంతితో అద్భుతం చేసింది.
Shefali Verma
Sachin Tendulkar
womens cricket
womens world cup
cricket world cup
India women cricket

More Telugu News