Siddaramaiah: కర్ణాటక సీఎం మార్పుపై రాష్ట్ర మంత్రి జమీర్ వ్యాఖ్యలు

Siddaramaiah CM Tenure Minister Zameer Clarifies Karnataka Leadership
  • కర్ణాటక సీఎం మార్పుపై మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
  • ఐదేళ్ల పూర్తికాలం సిద్ధరామయ్యే సీఎంగా ఉంటారని స్పష్టీకరణ
  • ఆ తర్వాతే డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అవుతారని వెల్లడి
  • డీకేకు సీఎం కావాలనే కోరిక ఉందని అంగీకరించిన మంత్రి
  • నవంబర్‌లో డీకే సీఎం అవుతారన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన వైనం
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదంపై ఆ రాష్ట్ర మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని, ఆ తర్వాతే ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో సీఎం మార్పుపై కొంతకాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం కుర్చీ విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే, ఈ నవంబర్‌లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ ఆయన మద్దతుదారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి జమీర్ స్పష్టతనిచ్చారు.

ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. “డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని ఆయన మద్దతుదారులు కోరుకోవడంలో తప్పులేదు. ఆయనకు కూడా సీఎం కావాలనే ఆకాంక్ష ఉంది. కానీ, 2028 వరకు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారు. ఆయన ఐదేళ్ల పూర్తి పదవీకాలం ముగిసిన తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు” అని వివరించారు.

 
Siddaramaiah
Karnataka CM
DK Shivakumar
Karnataka Politics
Congress
BZ Zameer Ahmed Khan
Chief Minister
Karnataka Government
Political News
Power Sharing

More Telugu News