Jogi Ramesh: జోగి రమేశ్ అరెస్ట్ పై ఏపీ బీజేపీ స్పందన

AP BJP Reacts to Jogi Ramesh Arrest in Fake Liquor Scam
  • కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
  • ఆయన అరెస్ట్‌ను స్వాగతించిన ఏపీ బీజేపీ
  • ఇది ఆఫ్రికా వరకు విస్తరించిన భారీ స్కాం అని ఆరోపణ
  • ఏ1 నిందితుడితో జోగి రమేశ్ కు ప్రత్యక్ష సంబంధాలున్నాయని వెల్లడి
  • సిట్ వద్ద పక్కా ఆధారాలున్నాయన్న బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ
  • జోగి రమేశ్ సోదరుడి ప్రమేయం కూడా ఉందని ఆరోపణ
నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత జోగి రమేశ్ ను సిట్ అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ స్పందించింది. జోగి రమేశ్ అరెస్ట్ ను స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ తెలిపారు. ఈ స్కాంలో జోగి రమేశ్ ప్రమేయంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని అన్నారు.

ఈ సందర్భంగా యామినీ శర్మ మాట్లాడుతూ.. "భారీ నకిలీ మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్‌ను ఏపీ బీజేపీ స్వాగతిస్తోంది. ఇది కేవలం స్థానిక స్కాం కాదు, దీని నెట్‌వర్క్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా ఆఫ్రికా వరకు విస్తరించి ఉంది" అని ఆరోపించారు.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్దనరావుతో జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను సిట్ సేకరించిందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆధారాల మేరకే అరెస్ట్ జరిగిందని ఆమె పేర్కొన్నారు.
Jogi Ramesh
AP BJP
Fake Liquor Scam
Andhra Pradesh
Yamini Sharma
SIT Investigation
Janardhan Rao
Jogi Ramu

More Telugu News