Atchannaidu: వైసీపీ డ్రగ్ దొంగలు మరోసారి దొరికారు: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu Slams YS Jagan Over Drug Case in Visakhapatnam
  • విశాఖలో వెలుగు చూసిన ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్ రాకెట్
  • దురంతో ఎక్స్‌ప్రెస్‌లో 36 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌తో పట్టుబడ్డ యువకుడు
  • వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి కోసం డ్రగ్స్ సరఫరా
  • కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్
  • యువతను డ్రగ్స్‌కు బానిసలుగా చేస్తున్నారంటూ వైసీపీపై మంత్రి అచ్చెన్న ఫైర్
  • వైసీపీ సమాజానికి ప్రమాదకరమన్న మంత్రి అచ్చెన్నాయుడు
బెంగళూరు నుంచి విశాఖపట్నానికి అక్రమంగా తరలిస్తున్న ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఇథైలమైడ్) డ్రగ్స్‌ను ఈగల్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందిస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ డ్రగ్స్ దొంగలు మరోసారి దొరికారంటూ ధ్వజమెత్తారు.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం క్యాంపెయిన్ ఉద్యమంలా చేపట్టి యువతని రక్షిస్తుంటే, వైసీపీ పార్టీ మాత్రం, యువతని డ్రగ్స్‌కి బానిసలుగా మార్చటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తోంది.. కానీ ఈగల్ టీం వాళ్ళకు చెక్ పెడుతోంది. బెంగళూరు నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో విశాఖపట్నానికి వస్తుండగా, చరణ్ అనే వ్యక్తిని ఈగల్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ కలిసి పట్టుకున్నాయి. అతని వద్ద నుంచి 36 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, ఈ స్ట్రిప్స్‌ను వైసీపీ స్టూడెంట్ విం‍గ్ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకువస్తున్నట్టు వెల్లడైంది. అనంతరం కొండారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతని డ్రగ్స్ బానిసలుగా మార్చటానికి, వైసీపీ విద్యార్థి విభాగం నేతలే రంగంలోకి దిగటంతో, ఆ పార్టీ సమాజానికి ఎంత ప్రమాదకరమో అర్ధమవుతుంది" అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 
Atchannaidu
YSCP
Andhra Pradesh
drugs case
LSD
Visakhapatnam
illegal drugs
Kondareddy
drug trafficking
Eagle Team

More Telugu News