Nara Rohith: శ్రీవారి సేవలో కొత్త దంపతులు.. తిరుమలలో నారా రోహిత్, శిరీష
కొత్త దంపతులు నారా రోహిత్, శిరీష ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నారా రోహిత్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. గత నెల 30న నారా రోహిత్, శిరీషల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో నారా రోహిత్ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.