Indigo Flight: హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు... ముంబైకి దారి మళ్లింపు

Indigo Flight Bomb Threat Leads to Diversion to Mumbai
  • జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం
  • మానవ బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్
  • ఎల్‌టీటీఈ, ఐఎస్ఐ ఈ దాడికి ప్రణాళిక వేశాయని మెయిల్
జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని దారి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయకుండా ముంబైకి తీసుకువెళ్లి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానాశ్రయ అధికారులకు శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉన్నట్లు రాసి ఉందని తెలిపారు.

1984లో మద్రాస్ విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడి తరహాలో ఈ దాడి జరుగుతుందని, ఎల్‌టీటీఈ, ఐఎస్ఐ ఈ దాడికి ప్రణాళిక వేశాయని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు పైలట్‌కు సమాచారం అందించారు. విమానాన్ని ముంబైలో ల్యాండ్ చేయాలని సూచించారు.
Indigo Flight
Indigo
Hyderabad Airport
Bomb threat
Mumbai Airport

More Telugu News