Aishwarya Rai: 52 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఐశ్వర్య అందం.. అసలు రహస్యం ఇదే!

Aishwarya Rai Bachchan Beauty Secrets Hydration and Skincare
  • 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఐశ్వర్య రాయ్
  • తన అందం వెనుక పెద్ద రహస్యాలేమీ లేవంటున్న ఐశ్వర్య
  • శరీరాన్ని హైడ్రేట్‌గా, పరిశుభ్రంగా ఉంచుకోవడమే అసలు సీక్రెట్ అని వెల్లడి
సౌందర్యరాశి ఐశ్వర్య రాయ్ బచ్చన్... ఈ పేరు వినగానే అందం, హుందాతనం గుర్తుకొస్తాయి. 1994లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న నాటి నుంచి నేటి వరకు, ఆమె గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఈరోజు (నవంబర్ 1) తన 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, దశాబ్దాలుగా చెక్కుచెదరని ఆమె సౌందర్య రహస్యాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఒక నటిగా, తల్లిగా, గ్లోబల్ ఐకాన్‌గా బహుళ పాత్రలు పోషించే ఐశ్వర్య తన దినచర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "సాధారణంగా అందరికీ రోజుకు 24 గంటలుంటే, నేను మాత్రం 48 గంటల పనిని అందులో పూర్తి చేయాల్సి ఉంటుంది" అని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన రోజు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే మొదలవుతుందని చెప్పారు.

ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ఆమె అందం ఎలా మెరిసిపోతుందని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అయితే, దీని వెనుక పెద్దగా ఖరీదైన ఉత్పత్తులు గానీ, సుదీర్ఘమైన స్కిన్‌కేర్ రొటీన్లు గానీ లేవని ఐశ్వర్య స్పష్టం చేశారు. "ప్రతి మహిళలాగే నేనూ సమయంతో పోటీ పడుతుంటాను. నా దృష్టిలో అందంగా కనిపించడానికి ముఖ్యమైనవి రెండే. ఒకటి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, రెండోది పరిశుభ్రంగా ఉండటం" అని ఆమె వివరించారు. ఈ రెండూ పాటిస్తే చర్మం దానంతట అదే ఆరోగ్యంగా కనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

దీంతో పాటు, మాయిశ్చరైజింగ్ తన జీవితంలో ఒక భాగమైపోయిందని ఐశ్వర్య తెలిపారు. "సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచే మాయిశ్చరైజింగ్ చేయడం అలవాటైంది. అది ఇప్పుడు నా దినచర్యలో సహజమైన భాగం. రోజు మొదట్లో, ముగింపులో తప్పనిసరిగా మాయిశ్చరైజర్ వాడతాను" అని ఆమె పేర్కొన్నారు.

52 ఏళ్ల వయసులో కూడా ఐశ్వర్య తనదైన శైలిలో అందానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. సింప్లిసిటీ, స్వీయ సంరక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ప్రకాశవంతంగా కనిపించవచ్చని ఆమె నిరూపిస్తున్నారు. 
Aishwarya Rai
Aishwarya Rai Bachchan
Aishwarya Rai beauty secrets
Aishwarya Rai skincare
Aishwarya Rai age
Miss World
Indian actress
Bollywood
beauty tips
hydration

More Telugu News