Lungi Mama: నేను చదువుకోలేదు .. డాన్స్ మాత్రమే తెలుసు: లుంగీ మామ!

Lungi Mama Interview
  • వెంకట రమణకి 'లుంగీమామ'గా పేరు
  • నెల్లూరు దగ్గర పల్లెటూరని వెల్లడి 
  • చేపల వేట మాత్రమే తెలుసని వివరణ 
  • తన టాలెంట్ కి బాబాయ్ కారకుడని వ్యాఖ్య   

యూ ట్యూబ్ ను ఎక్కువగా చూసేవారికి 'లుంగీ మామ' గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. లుంగీ పైకి కట్టి .. చెప్పులతో .. రోడ్డు పక్కనే ఆయన వేసే స్టెప్స్ ను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఆయన గురించి తెలుగుకోవాలనే ఆసక్తి కూడా చాలామందికి ఉండేది. అలాంటి ఆయన హఠాత్తుగా మొన్న వచ్చిన 'కె ర్యాంప్' సినిమాలో, కిరణ్ అబ్బవరంతో కలిసి స్టెప్పులు వేశాడు. అలాంటి లుంగీమామ తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. 

" నా అసలు పేరు వెంకట రమణ. మాది నెల్లూరు జిల్లా లోని ఒక మారుమూల గ్రామం. నేను స్కూలుకి వెళ్లింది లేదు .. చదువుకున్నదీ లేదు. మాది మత్స్య కారుల కుటుంబం. అందరం సముద్రంపై ఆధారపడేవాళ్లమే. చిన్నప్పటి నుంచే మా బాబాయ్ తో కలిసి చేపల వేటకి వెళ్లేవాడిని. మా బాబాయ్ 'గోవింద్' కారణంగానే నాకు డాన్స్ పట్ల ఆసక్తి ఏర్పడింది.  పాట వినిపిస్తే చాలు డాన్స్ చేస్తాడని మా ఊళ్లో చెప్పుకునేవారు" అని అన్నాడు. 

" మా ఊరికి చెందిన మున్నా - నరేందర్ కలిసి రీల్స్ చేసేవాళ్లు. ఒకరోజున వాళ్లు వచ్చి వీడియోస్ చేద్దామని అన్నారు. అలా చేసిన ఫస్టు సాంగ్ కి 4 మిలియన్స్ వ్యూస్  వచ్చింది. సాంగ్స్ దాదాపు నేనే సెలెక్ట్ చేస్తాను. ఎడిటింగ్ .. అప్ లోడ్ చేయడం అంతా కూడా మున్నా చూసుకుంటాడు. 'కె ర్యాంప్' సినిమా మాకు మరింత గుర్తింపు తెచ్చింది. ఆ పాటను మేమే కంపోజ్ చేసుకున్నాం. తెరపై కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది" అని చెప్పాడు. 

Lungi Mama
Venkata Ramana
Kiran Abbavaram
K Ramp Movie
Telugu Dance
Viral Videos
Suman TV Interview
Nellore District
Telugu Reels
Fisherman

More Telugu News