: నాలుగు గంటల సినిమా అయినా అద్భుతం... 'బాహుబలి'పై విదేశీయుల రివ్యూలు
- 'బాహుబలి ది ఎపిక్' పేరుతో రెండు భాగాలు కలిపి రీ-రిలీజ్ చేసిన రాజమౌళి
- తొలి రోజే రూ.10.4 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన చిత్రం
- ప్రపంచవ్యాప్తంగా సినిమాకు వెల్లువెత్తుతున్న ప్రశంసలు
- సినిమా కాదు.. ఒక కావ్యం అంటూ ఫ్యాన్స్ కితాబు
- హాలీవుడ్ స్టార్ వార్స్, మార్వెల్ చిత్రాలను మించిందన్న రివ్యూలు
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన అద్భుతం 'బాహుబలి' ఏళ్ల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్‌క్లూజన్' చిత్రాలను కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో శుక్రవారం థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. ఈ రీ-రిలీజ్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ డాట్‌కామ్ ప్రకారం ఈ చిత్రం తొలి రోజే భారతదేశంలో రూ.10.4 కోట్ల నెట్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను పంచుకుంటూ జక్కన్న మేజిక్‌ను కొనియాడుతున్నారు. "విదేశీ ప్రేక్షకులు ఈ ఎపిక్‌ను చూసి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. లెటర్‌బాక్స్‌డ్ రివ్యూలు అద్భుతంగా ఉన్నాయి" అంటూ 'బాహుబలి' చిత్ర బృందం అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొంది. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నా, ప్రతి క్షణం అద్భుతంగా ఉందని, ఈ సినిమా ముందు ఇప్పటివరకు వచ్చిన ఏ చిత్రమూ సరితూగదని అంతర్జాతీయ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఒక అభిమాని తన రివ్యూలో, "ఇది నా జీవితంలో చూసిన గొప్ప చిత్రం. థియేటర్‌లో అందరి కేకలు, చప్పట్ల మధ్య ఈ సినిమాను చూడటం ఒక మరపురాని అనుభవం" అని రాశారు. మరో ప్రేక్షకుడు స్పందిస్తూ "పశ్చిమ దేశాల వారికి 'స్టార్ వార్స్' ఎలాంటిదో, నాకు 'బాహుబలి' అలాంటిది. ఇది కేవలం యాక్షన్, డ్రామా మాత్రమే కాదు... ఇదొక కావ్యం, ఒక పురాణం" అని పేర్కొన్నాడు. మరికొందరు ఈ చిత్రాన్ని "ఒక ఒపెరా (సంగీత నాటకం)" అని అభివర్ణిస్తూ, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన చిత్రమని కొనియాడారు.
అమెరికాకు చెందిన ఓ ప్రేక్షకుడు, "ఈ సినిమా ఏ మార్వెల్ సినిమా కన్నా గొప్పది. ఫాంటసీ జానర్‌లో ఇంతకంటే ఉత్తమమైన సినిమా లేదు" అని ప్రశంసించారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, నటీనటుల అద్భుత నటన, కీరవాణి సంగీతం ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
2015, 2017లో విడుదలైన 'బాహుబలి' రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఒకే భాగంగా రీమాస్టర్ చేసి విడుదల చేయడం విశేషం.