Bandi Sanjay: రేవంత్ వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని దెబ్బతీశాయి: బండి సంజయ్
- మన సైనికుల ధైర్యసాహసాలను రేవంత్ అవమానించారన్న బండి
- ఉగ్రవాదంపై మోదీ చర్యలను ప్రస్తావించిన బండి సంజయ్
- సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా పాకిస్థాన్ గురించి సీఎం చేసిన వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని, సైనికుల ధైర్యసాహసాలను అవమానించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మనపై దాడి చేసినా భారత్ స్పందించలేదన్న అర్థం వచ్చేలా సీఎం మాట్లాడారని బండి సంజయ్ ఆరోపించారు. "జూబ్లీహిల్స్‌లో భారత్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన వ్యాఖ్యలు పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన మన సైనికుల ధైర్యసాహసాలకు అవమానం" అని బండి సంజయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రతి భారతీయుడు మన జవాన్ల సాహసం పట్ల గర్వపడుతున్నాడని ఆయన తెలిపారు. "ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఇది ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న కఠిన చర్యలకు ప్రతీక. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు, భారత ప్రజలకు సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి," అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.