Chandrababu: చుక్కపల్లి, పాతూరి కుటుంబాల వివాహ వేడుకల్లో సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Participates in Pathuri Nagabhushanam Sons Pre Wedding Event
  • శుక్రవారం పలు శుభకార్యాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • కంకిపాడులో వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి
  • చుక్కపల్లి మోహన్‌రావు కుమారుడి వివాహంలో పాల్గొన్న సీఎం
  • వధూవరులు సాయిసూర్య, అమర చరితలను ఆశీర్వదించిన చంద్రబాబు
  • బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలో సందడి
  • కాబోయే దంపతులు సాయికృష్ణ, విరజలకు శుభాకాంక్షలు
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం పలు శుభకార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. పరిపాలన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన ప్రముఖుల ఇళ్లలో జరిగిన వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివరాల్లోకి వెళితే.. కంకిపాడులో జరిగిన చుక్కపల్లి మోహన్‌రావు కుమారుడి వివాహ మహోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సాయిసూర్య, అమర చరితలను మనసారా ఆశీర్వదించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలో కూడా సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాబోయే దంపతులు సాయికృష్ణ, విరజలతో ముచ్చటించి, వారికి శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమాల్లో సీఎం రాకతో సందడి వాతావరణం నెలకొంది.

Chandrababu
AP CM
Andhra Pradesh
Chukkapalli Mohan Rao
Pathuri Nagabhushanam
Wedding
Kankipadu
Sai Surya
Amara Charitha
Sai Krishna

More Telugu News