Balaraju: సిద్దిపేటలో దారుణం... కదులుతున్న బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

Balaraju commits suicide by falling under moving bus in Siddipet
  • సిద్దిపేటలోని పొన్నాల దాబా వద్ద ఘటన
  • మృతుడిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తింపు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేటలోని పొన్నాల దాబా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని మద్దూరు మండలం, వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు.

పొన్నాల వద్ద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు వస్తుండగా, బాలరాజు బస్సు ముందు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బస్సు సమీపానికి రాగానే, ముందు డోర్ నుంచి ఎక్కుతున్నట్టుగా ప్రయత్నించి, ఒక్కసారిగా ముందు చక్రాల కింద పడుకున్నాడు. ఊహించని ఈ సంఘటనతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపడానికి ప్రయత్నించాడు, కానీ అప్పటికే బస్సు చక్రం అతనిపై నుంచి వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Balaraju
Siddipet
Telangana
RTC bus
Suicide
Ponnala Dhaba
Maddur mandal
Vallampatla village

More Telugu News