Tamannaah: హత్య చేసినా ఓకే.. కానీ అబద్ధం చెబితే ఊరుకోను: తమన్నా
- రిలేషన్‌షిప్‌లో అబద్ధాలు అస్సలు సహించనన్న తమన్నా
- ఎంత పెద్ద తప్పు చేసినా ఫర్వాలేదు కానీ అబద్ధం చెప్పొద్దన్న మిల్కీ బ్యూటీ
- తనను తెలివితక్కువ దానిగా భావిస్తే తీవ్రమైన కోపం వస్తుందని వెల్లడి
ప్రముఖ నటి తమన్నా తన వ్యక్తిగత సంబంధాలు, భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక బంధంలో తాను ఏ విషయాన్ని అస్సలు సహించలేదో స్పష్టం చేశారు. అబద్ధం చెప్పడం తనకు ఏమాత్రం నచ్చదని, దాన్ని తట్టుకోలేనని కుండబద్దలు కొట్టారు.
ఇటీవల 'యువా'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ, "నాకు అబద్ధాలు చెప్పేవాళ్లను చూస్తే అస్సలు సహించలేను. ఏదైనా తప్పు జరిగినా, సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉంటాను. అవసరమైతే మీరు ఒక హత్య చేసినా దాన్ని కప్పిపుచ్చడానికి నేను సాయం చేస్తానేమో (నవ్వుతూ). కానీ, అబద్ధాలు చెప్పే వారిని మాత్రం నేను భరించలేను" అని అన్నారు.
ఆమె ఇంకా వివరిస్తూ, "నా ముఖం మీదే అబద్ధం చెప్పి, దాన్ని నేను నమ్మేంత మూర్ఖురాలిని అని అవతలి వారు అనుకున్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. సమస్య కేవలం అబద్ధం చెప్పడం కాదు, అవతలి వారు మనల్ని అంత తెలివితక్కువ వారని భావించడమే అసలు సమస్య" అని తమన్నా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.
గతంలో తమన్నా, నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2023లో 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. తరచూ పలు కార్యక్రమాలకు, పార్టీలకు కలిసి హాజరయ్యారు. అయితే, ఇటీవలే వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా తమన్నా మాట్లాడుతూ, తాను ఒక గొప్ప జీవిత భాగస్వామిగా మారేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. "ఎవరి జీవితంలోకి నేను వెళ్లినా, వారు గత జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నందుకే నేను దొరికానని భావించాలి. ఆ అదృష్టవంతుడి కోసం నేను నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నాను" అని ఆమె చెప్పడం గమనార్హం. తాజా వ్యాఖ్యలతో బంధంలో నిజాయతీకి ఆమె ఎంత విలువిస్తారో స్పష్టమవుతోంది.