Paradise Metro Station: మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వ్యక్తి.. ప్యారడైజ్ లో కలకలం

Hyderabad Man Attempts Suicide at Paradise Metro Station
––
సికింద్రాబాద్ ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వద్ద ఈరోజు ఉదయం కలకలం రేగింది. మెట్రో స్టేషన్ లోకి వెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మెట్రో స్టేషన్ పైనుంచి అతడు కిందకు దూకాడు.

మెట్రో సిబ్బంది వేగంగా స్పందించి గాయాలపాలైన ఆ వ్యక్తిని అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెట్రో సిబ్బంది ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.
Paradise Metro Station
Hyderabad
Metro Station
Suicide Attempt
Begumpet Police
Gandhi Hospital
Mental Health
Telangana
Crime News

More Telugu News