Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత.. ఆందోళనలో భక్తులు

Leopard Spotted on Srivari Mettu Route in Tirumala
  • 150వ మెట్టు వద్ద కనిపించిన చిరుత
  • భయాందోళనతో కేకలు వేసిన భక్తులు
  • భక్తులను గుంపులుగుంపులుగా పంపిస్తున్న టీటీడీ సిబ్బంది
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో చిరుత కనిపించినట్లు భక్తులు తెలిపారు. 150వ మెట్టు వద్ద మెట్ల మార్గం దాటుతున్న చిరుతను చూసి భక్తులు భయాందోళనలతో కేకలు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. చిరుత సంచారం నిజమేనని నిర్ధారించి, భక్తులను హెచ్చరించారు. అటవీ అధికారులు చిరుతను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

భద్రతా చర్యల్లో భాగంగా శ్రీవారి మెట్టు ప్రారంభంలో, 800వ మెట్టు వద్ద భక్తులను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో 100-150 మంది భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. పిల్లలను జాగ్రత్తగా పట్టుకొని నడవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ సిబ్బంది భక్తులకు సూచించారు.
Tirumala
Leopard
Srivari Mettu
TTD
Devotees
Forest Department
Wildlife
Andhra Pradesh
Tirupati

More Telugu News