share certificates: ఇంట్లోని చెత్తబుట్టలో దొరికిన విలువైన షేర్లు.. తండ్రీకొడుకుల మధ్య చిచ్చు!

Shares Worth Crores Found in Trash Spark Family Dispute in Gujarat
  • గుజరాత్ లోని ఓ వ్యక్తిని వరించిన అదృష్టం
  • తాత ఇంట్లో మనవడికి దొరికిన షేర్ సర్టిఫికెట్లు
  • తనకే దక్కుతాయంటూ కోర్టుకెక్కిన తండ్రీకొడుకులు
తాత ఇంట్లో సామాన్లు సర్దుతుండగా చెత్తబుట్టలో కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు కనిపించాయి.. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ చూసిన ఆ మనవడు అవాక్కయ్యాడు. అప్పుడెప్పుడో కొన్న సదరు షేర్లు ప్రస్తుతం రూ.కోట్లు విలువ చేస్తాయని తెలిసి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. రూ. కోట్ల నిధి దొరికిందని సంబరపడుతుండగానే ఆ షేర్లు తనకే దక్కాలని అతడి తండ్రి పట్టుబట్టాడు. దీంతో షేర్ల కోసం ఆ తండ్రీకొడుకులు కోర్టుకెక్కారు. గుజరాత్ లోని ఉనా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు..

ఉనా గ్రామానికి చెందిన సావ్జీ పటేల్ డయ్యూలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారు. పటేల్ తండ్రికి సొంతగ్రామంలో ఓ ఇల్లు ఉంది. వృద్ధాప్యంలో సొంతూరుకు వెళ్లిపోయిన సావ్జీ పటేల్.. చివరి రోజులను అక్కడే గడిపాడు. ఇటీవల ఆయన మరణించాడు. అంతకుముందే తన ఆస్తికి వారసుడు తన మనవడేనని వీలునామా రాశాడు. కాగా, సావ్జీ పటేల్ కొడుకు కూడా డయ్యూలో ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సావ్జీ పటేల్ మనవడు ఇటీవల ఉనా గ్రామానికి వెళ్లాడు.

తాత గారి ఇంటిని శుభ్రపరుస్తుండగా చెత్త బుట్టలో షేర్ సర్టిఫికెట్లు కనిపించాయి. దీంతో ఆన్ లైన్ లో చెక్ చేయగా.. వాటి విలువ రూ.2.5 కోట్లని తేలింది. రాత్రికిరాత్రే కోటీశ్వరుడిని అయ్యానని సావ్జీ పటేల్ మనవడు సంబరపడ్డాడు. అయితే, విషయం తెలియడంతో ఆ యువకుడి తండ్రి కూడా వాటా కోసం వచ్చాడు. తన తండ్రి కొన్న షేర్లు తనకే దక్కుతాయని తండ్రి.. తాత ఆస్తి మొత్తం తనకే రాశాడు కాబట్టే ఈ షేర్లు కూడా తనవేనని మనవడు వాదించాడు. షేర్లపై హక్కు కోసం తండ్రీకొడుకులు ఇద్దరూ కోర్టుకెక్కారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు విచారణలో ఉంది.
share certificates
inheritance dispute
stock market
old house
Savji Patel
Gujarat news
Una village
old house
treasure find
property division
court case

More Telugu News