Khammam: ఖమ్మంలో దారుణం.. సీపీఎం నేత దారుణ హత్య

CPM Leader Samineni Ramarao Brutally Murdered in Khammam
  • చింతకాని మండలం పాతర్లపాడులో ఘటన
  • రైతు సంఘం నేత సామినేని రామారావుగా గుర్తింపు
  • ఉదయం వాకింగ్‌కు వెళ్లగా గొంతుకోసి చంపిన దుండగులు
  • ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీపీఎం రైతు సంఘం నేత సామినేని రామారావును గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. సామినేని రామారావు రోజూ మాదిరిగానే ఈరోజు ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో మార్గమధ్యంలో ఆయన్ను అడ్డగించిన దుండగులు, పదునైన ఆయుధంతో గొంతుకోసి హతమార్చారు. రక్తపు మడుగులో పడివున్న ఆయన్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Khammam
Samineni Ramarao
CPM
Murder
Farmer leader
Patarlapadu
Telangana
Political Murder

More Telugu News