Vangalapudi Anitha: అధికారుల తీరు అద్భుతం.. బోటును ఒడ్డుకు చేర్చడంతో సంగం బ్యారేజీకి పెను ముప్పు తప్పింది: వంగలపూడి అనిత

Vangalapudi Anitha Praises Officials for Averting Sangam Barrage Disaster
  • 35 టన్నుల భారీ బోటును ఒడ్డుకు చేర్చడంలో అధికారుల తీరు ప్రశంసనీయమన్న అనిత
  • బ్యారేజీకి ప్రమాదం సంభవించకుండా కలెక్టర్ సహా అధికారులు, సిబ్బంది పని చేశారని కితాబు
  • సంగం బ్యారేజీ బోటు ప్రమాదానికి గురి కాకుండా చర్యలు తీసుకున్నారన్న అనిత
అధికారుల ముందస్తు చర్యలతో నెల్లూరులోని సంగం బ్యారేజీకి ముప్పు తప్పిందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మొంథా తుఫాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, సంగం బ్యారేజీకి కొట్టుకువచ్చిన 35 టన్నుల భారీ బోటును ఒడ్డుకు చేర్చడంలో అధికారుల చూపిన చొరవ అభినందనీయమని ఆమె అన్నారు.

సకాలంలో స్పందించి బోటు కారణంగా బ్యారేజీకి ప్రమాదం సంభవించకుండా కలెక్టర్, జిల్లా అధికారులు వెంటనే స్పందించారని ఆమె కొనియాడారు. తద్వారా సంగం బ్యారేజీ ప్రమాదానికి గురికాకుండా చర్యలు తీసుకున్నారని వంగలపూడి అనిత తెలిపారు.

ఏం జరిగిందంటే?

సంగం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన అందరినీ ఆందోళనకు గురి చేసింది. నదిలో లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో, 30 టన్నుల బరువున్న ఇసుక బోటు లంగరు తెగిపోయి నేరుగా బ్యారేజీ గేట్ల దిశగా దూసుకొచ్చింది.

ఒకవేళ ఆ భారీ బోటు వరద ఉద్ధృతికి బ్యారేజీని ఢీకొంటే, 85 గేట్లతో నిర్మితమైన సంగం బ్యారేజీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉండేది. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లితే పరిస్థితి ఊహించలేనంత తీవ్రంగా ఉండేది. ఈ విషయం తెలియగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ డా. అజిత వజ్రేంద్ర వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

30 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 30 మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 100 మంది పోలీస్, భద్రతా దళ సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం సమన్వయంతో పనిచేసి భారీ ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో బోటును ఒడ్డుకు చేర్చారు.
Vangalapudi Anitha
Sangam Barrage
Nellore
Andhra Pradesh
Boat Accident
Montha Cyclone

More Telugu News