Srinidhi Shetty: చాలామంది అనుకున్నది ఇదే .. శ్రీనిధి శెట్టి దశ తిరిగినట్టే!

Srinidhi Shetty Special
  • 'కేజీఎఫ్'తో సంచలన విజయం 
  • తెలుగులో పెరుగుతున్న జోరు 
  • వెంకీ సరసన లభించిన ఛాన్స్ 
  • జోడీ బాగుంటుందని అంటున్న ఫ్యాన్స్  

వెండితెరపై బంగారు తీగ మాదిరిగా మెరిసిన కథానాయికలలో శ్రీనిధి శెట్టి ఒకరు. అలాగే చీరకట్టులో మరింత ఆకర్షణీయంగా అనిపించే నాయికలలో కూడా ఆమె పేరును చేర్చుకోవచ్చు. మొదటి  సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం .. స్టార్ డమ్ ను సంపాదించుకోవడం చాలా తక్కువ మంది కథానాయికల విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన కథనాయికల జాబితాలో, 'కేజీఎఫ్' సినిమా ఆమెకి స్థానం దక్కేలా చేసింది. 

ఒక వైపున కన్నడలో తనకి నచ్చిన పాత్రల కోసం వెయిట్ చేస్తూనే, మరో వైపున ఆమె టాలీవుడ్ .. కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. తెలుగులో 'హిట్ 3' .. 'తెలుసుకదా' సినిమాలు చేసిన శ్రీనిధి శెట్టి, ఇప్పుడు త్రివిక్రమ్ - వెంకటేశ్ కాంబినేషన్ లోని సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. త్రిష మొదలు చాలామంది సీనియర్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించి చివరికి ఆమెను ఎంపిక చేశారు. ఆల్రెడీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది.

శ్రీనిధి శెట్టి మంచి పొడగరి. చీరకట్టులో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెరపై ఆమెను చూసినప్పుడే తెలుగులో వెంకటేశ్ జోడీగా ఆమె బాగా సెట్ అవుతుందని వెంకీ అభిమానులు భావించారు. అయితే ఆ ముచ్చట ఇంత త్వరగా తీరుతుందని ఎవరూ అనుకోలేదు. దర్శకుడిగా త్రివిక్రమ్ తొలిసారిగా వెంకటేశ్ తో చేస్తున్న ఈ సినిమాలో ఆమెకి ఛాన్స్ దొరకడం విశేషం. ఈ సినిమాతో తెలుగులో దశ తిరిగిపోవడం ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. వచ్చేనెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగులో శ్రీనిధి శెట్టి పాల్గొననుంది.

Srinidhi Shetty
Srinidhi Shetty movies
Venkatesh
Trivikram
Hit 3
Telusukada
Tollywood
KGF movie
Telugu cinema
actress

More Telugu News