గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 104 మంది పాలస్తీనియన్ల మృతి
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ పదే పదే ఉల్లంఘిస్తోందన్న ఇజ్రాయెల్
- హమాస్ కు బుద్ధి చెప్పేందుకే ప్రతి దాడులు చేస్తున్నామని వెల్లడి
- ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన హమాస్
దక్షిణ గాజాలో ఉన్న తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే తాము మళ్ళీ యుద్ధం ప్రారంభించామని నెతన్యాహు తెలిపారు. తమ సైనికుడిని హమాస్ చంపేయడంతో టెర్రర్ గ్రూపులపై దాడులు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడుల్లో ఇప్పటి వరకు 104 మంది పాలస్తీనా పౌరులు చనిపోగా మరో 250 మందికి గాయాలయ్యాయి. అయితే, నెతన్యాహు ఆరోపణలను హమాస్ ఖండించింది. తమవైపు నుంచి ఎలాంటి కాల్పులు జరగకున్నా స్కూళ్ళు, ఇళ్ళపై ఐడీఎఫ్ బాంబులు వేస్తోందని ఆరోపించింది.