Nani: హీరోల దూకుడు ఇలా తగ్గిందేటబ్బా!

Tollywood Heros Special
  • ఏడాదికి 3 సినిమాలు చేస్తూ వెళ్లే హీరోలు 
  • ఒక సినిమాకి పరిమితమవుతున్న నాని
  • 2023 తరువాత కనిపించని అఖిల్ - నిఖిల్ 
  • ఎక్కువ గ్యాప్ తీసుకున్న నాగశౌర్య
  • వెనకబడిపోతున్న ఇతర హీరోలు  

ఒకప్పుడు సినిమాల నిర్మాణం చకచకా సాగిపోయేది. ఏడాదికి 10 .. 12 సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు. ఆ తరువాత కాలంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టడం మొదలైంది. ఈ మధ్య కాలంలో ఈ జోరు మరింత తగ్గడం కనిపిస్తుంది. సీనియర్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో రవితేజ .. నాని వంటి హీరోలు ఏడాదికి మూడు సినిమాలు అందిస్తూ వచ్చారు. 

ఇక నాని తరువాత లైన్లో ఉన్న హీరోలు కూడా ఏడాదికి రెండు .. మూడు సినిమాలు చేస్తూ తమ స్పీడ్ చూపించారు. రెండు .. మూడేళ్లుగా చూసుకుంటే నాని - శర్వానంద్ స్థాయి హీరోలు సహా, యంగ్ హీరోలు సైతం తమ సినిమాల సంఖ్యను తగ్గించుకోవడం కనిపిస్తుంది. గడిచిన రెండేళ్లలో నాని ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేశాడు. ఇక శర్వానంద్ 'మనమే' తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు.

ఇక నిఖిల్ విషయానికి వస్తే, 'స్పై' తరువాత తన సందడి కూడా తగ్గుతూ వచ్చింది. 'స్వయంభూ'ను లైన్లో పెట్టే పనిలో ఆయన సతమతమవుతున్నాడు. హ్యాండ్సమ్ హీరో అంటే ఇలా ఉండాలి అనిపించే నాగశౌర్య కూడా 'రంగబలి' తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. 'బ్యాడ్ బాయ్ కార్తీక్'ను బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. సుధీర్ బాబు కూడా చాలా గ్యాప్ తరువాతే 'జటాధర'ను థియేటర్లకు తీసుకొస్తున్నాడు. 'లెనిన్'తో అఖిల్ లేట్ చేస్తూనే ఉండగా, 'భజే వాయువేగం' తరువాత కార్తికేయ హడావిడి కూడా కనిపించడం లేదు. ఏడాదికి మూడేసి సినిమాలు చేయవలసిన హీరోలు ఇలా ఒక సినిమాతో థియేటర్స్ కి రావడానికి ఇబ్బందులు పడుతుండటం ఆలోచించవలసిన విషయమే. 

Nani
Telugu cinema
Tollywood
Sharwanand
Nikhil Siddhartha
Naga Shaurya
Sudheer Babu
Kartikeya Gummakonda
Telugu film industry
Indian movies

More Telugu News