RBI: రద్దు చేసిన పెద్ద నోట్ల మార్పిడికి కొత్త నిబంధనలు అంటూ ప్రచారం... స్పందించిన కేంద్ర ప్రభుత్వం

RBI Denies New Rules for Old Note Exchange Government Clarifies
  • రూ. 500, రూ. 1000 నోట్లను మార్చుకోవడానికి కొత్త నిబంధనలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
  • ఆర్బీఐ అలాంటి నిబంధనలు జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
  • ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్‌లో ఆర్థిక నిబంధనల సమాచారం తెలుసుకోవచ్చని సూచన
తొమ్మిదేళ్ల క్రితం రద్దయిన రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధన తీసుకువచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ ఎలాంటి నిబంధనలు జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా తెలిపింది.

ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in లో ఆర్థిక నిబంధనలకు సంబంధించిన సమాచారం, తాజా అప్‌డేట్స్‌ అందుబాటులో ఉంటాయని సూచించింది.

అనుమానాస్పద సందేశాలు, ఫొటోలు, వీడియోలు దృష్టికి వస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ నెంబర్ +91 8799711259 లేదా [email protected] కు మెయిల్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపింది.
RBI
RBI new rules
Rupee exchange
Demonetization
PIB Fact Check
Currency exchange rules

More Telugu News