Mukesh Ahirwar: కోరిక తీర్చలేదని భార్యను మేడ పైనుంచి తోసేశాడు!

Jhansi Man Throws Wife off Building Over his desire Refusal
  • ఉత్తరప్రదేశ్‌లో దారుణం
  • శృంగారానికి నిరాకరించడమే ఈ ఘాతుకానికి కారణం
  • పెళ్లయిన ఏడాది నుంచే వేధింపులకు గురిచేస్తున్న భర్త
  • భర్త, అత్తామామలు కలిసే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణ
  • స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలింపు
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శృంగారానికి నిరాకరించిన భార్యను ఆమె భర్త భవనం పైనుంచి కిందకు తోసేశాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. మౌ రాణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన తీజా (26) అనే యువతికి 2022లో ముఖేశ్ అహిర్వార్‌తో వివాహమైంది. ఓ గుడిలో పరిచయమైన ముఖేశ్.. జీవితాంతం తోడుగా ఉంటానని, బాగా చూసుకుంటానని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాది పాటు అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాత ముఖేశ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ ఇంటికి రాకుండా బయటే ఉండటం, వచ్చినప్పుడల్లా కొట్టడం చేసేవాడని బాధితురాలు తెలిపింది.

ఇదే క్రమంలో సోమవారం ఇంటికి వచ్చిన ముఖేశ్, ఆమెపై దాడి చేసి, తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. మంగళవారం కూడా మరోసారి బలవంతంగా శృంగారినికి ప్రయత్నించగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన ముఖేశ్, అతని తల్లిదండ్రులు కలిసి ఆమెను పైనుంచి కిందకు తోసేసినట్లు బాధితురాలు ఆరోపించింది.

తీజా కేకలు విన్న స్థానికులు, ఆమెను గాయపడిన స్థితిలో గుర్తించి వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఆరోపణలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
Mukesh Ahirwar
Jhansi
Uttar Pradesh
domestic violence
attempted murder
crime news
sexual assault
police investigation
Tija
crime against women

More Telugu News