Bhagya Shree Borse: ఇటు 'కాంత' .. అటు 'ఆంధ్రా కింగ్ తాలూకా'

Bhagyasree Borse Special
  • గ్లామర్ క్వీన్ గా భాగ్యశ్రీ బోర్సే
  • దుల్కర్ జోడీగా చేసిన 'కాంత' 
  • నవంబర్ 14న రిలీజ్
  • రామ్ సరసన 'ఆంధ్రా కింగ్ తాలూకా'
  • నవంబర్ 27వ తేదీన విడుదల

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికల జాబితాలో భాగ్యశ్రీ బోర్సే ముందు వరుసలో కనిపిస్తుంది. పాలరాతి శిల్పానికి అప్పుడే ప్రాణం పోసినట్టుగా .. దేవలోకం నుంచి అప్పుడే దిగివచ్చినట్టుగా కనిపించే భాగ్యశ్రీకి, తొలి సినిమా నుంచే అభిమానుల సంఖ్య పెరగడం మొదలైంది. కలువల్లా విచ్చుకున్న కళ్లతోనే కబుర్లు చేప్పే భాగ్యశ్రీకి భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెరుగుతూ వెళుతోంది. దాంతో అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి.

భాగ్యశ్రీ గొప్ప అందగత్తె అనడంలో ఎలాంటి సందేశం లేదు. అయితే ఆమె చేసిన రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. యూత్ హృదయాలపై ఆమె వేసిన గాఢమైన ముద్ర కారణంగా ఆ పరాజయాలు ఆమె కెరియర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమె కూడా లైట్ తీసుకుని తమిళంలో దుల్కర్ జోడీగా 'కాంత' .. తెలుగులో రామ్ సరసన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాలు చేస్తూ వెళ్లింది. 'కాంత'నవంబర్ 14వ తేదీన విడుదలవుతుంటే, 'ఆంధ్రా కింగ్ తాలూకా' 27వ తేదీన విడుదల కానుంది. 

'కాంత' టైటిల్ తోనే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాదు 1950లలో నడిచే కథ కావడం వలన ఆడియన్స్ మరింత కుతూహలంతో ఉన్నారు. ఆ కాలం నాటి లుక్ తో భాగ్యశ్రీ కొత్తగా కనిపిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఇక రామ్ తో చేసిన 'ఆంధ్రా కింగ్ తాలూకా'లోను ఆమె పాత్ర డిఫరెంట్ గా అనిపిస్తోంది. చాలా తక్కువ గ్యాప్ లో ఒకదాని తరువాత ఒకటిగా విడుదలవుతున్న ఈ సినిమాలు, ఆమె కెరియర్ గ్రాఫ్ ను పెంచుతాయేమో చూడాలి.

Bhagya Shree Borse
Bhagya Shree Borse movies
Kanthaa movie
Andhra King Taluka
Telugu cinema
Tamil cinema
Ram Pothineni
Selvamani Selvaraj
Tollywood actress

More Telugu News