Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ 4వ వర్థంతి.. ఆయన భార్య భావోద్వేగ పోస్టు

Puneeth Rajkumar 4th Death Anniversary Wife Ashwini Emotional Post
  • ‘అప్పూ’ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు.. పునీత్ భార్య అశ్విని
  • ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలంటూ క్యాప్షన్
  • అప్పూ మనతో లేరనే విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం.. అభిమానుల కామెంట్లు
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి నేటికి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఈ రోజు ఆయన వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనను స్మరించుకుంటున్నారు. పునీత్ భార్య అశ్విని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు.

పునీత్ ను అభిమానులు ‘అప్పూ’ అని ప్రేమగా పిలుచుకునే విషయాన్ని గుర్తుచేస్తూ.. “మన అప్పూ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాడు. ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అంటూ పునీత్ ఫొటోతో అశ్విని ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ‘అప్పూ చిరునవ్వు ఇంకా మన మనసుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది’ అని, ‘అప్పూ మనతో లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

హోంబలే ఫిలింస్ నివాళి
పునీత్ తో పలు సినిమాలు రూపొందించిన హోంబలే ఫిలింస్  ఆయనను స్మరించుకుంది. “దయ, మానవత్వం ప్రతిరూపం అయిన డా. పునీత్ రాజ్‌కుమార్‌ను ప్రేమగా గుర్తు చేసుకుంటున్నాం. ఆయన లెగసీ ప్రతిరోజూ మాకు ప్రేరణగా నిలుస్తోంది” అని ట్వీట్ చేసింది.
Puneeth Rajkumar
Ashwini Puneeth Rajkumar
Appu
Kannada cinema
Hombale Films
Sandalwood
Puneeth Rajkumar death anniversary
Karnataka
Tribute
Social media

More Telugu News