Hurricane Melissa: తుపాన్ మధ్యలో ఇంత అద్భుతంగా ఉంటుందా.. వీడియో ఇదిగో!
- మెలిస్సా హరికేన్ మధ్యలోకి వెళ్లి వీడియో తీసిన అమెరికా విమానం
- ‘హరికేన్ హంటర్స్’ విమానంతో ఎయిర్ ఫోర్స్ ప్రయోగం
- జమైకాను వణికిస్తున్న మెలిస్సా హరికేన్
- 174 ఏళ్లలో ఇదే అత్యంత భీకరమైన తుపాన్
కరీబియన్ సముద్ర తీర దేశాలను మెలిస్సా హరికేన్ వణికిస్తోంది. ముఖ్యంగా జమైకాలో ఈ తుపాన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాదిలో ఇదే అత్యంత శక్తిమంతమైన తుపాన్ అని, ఇంతటి భీకర తుపాన్ ను 174 ఏళ్లలో ప్రపంచం చూడలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ఈ తుపాన్ జమైకాలో భారీ విధ్వంసం సృష్టిస్తుండగా అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ‘హరికేన్ హంటర్స్’ విమానం ఆకాశంలో నుంచి ఈ తుపాన్ ను రికార్డు చేసింది.
అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ కోసం వాతావరణానికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించడం కోసం ఎయిర్ ఫోర్స్ ఈ మిషన్ చేపట్టింది. హరికేన్ మధ్యలోకి చొచ్చుకెళ్లి వీడియో తీసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భూమిపై విధ్వంసం సృష్టిస్తూ భయాందోళనలను రేకెత్తించే తుపాన్ మధ్యలో ఇంతటి అద్భుతం దాగుందా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యోదయం అయిన కొద్ది సేపటికే విమానం ఆ తుపాన్ మధ్యలోకి ఆగ్నేయ దిశ నుంచి ప్రవేశించింది. దట్టమైన బూడిద రంగు మేఘాల గుండా ప్రయాణిస్తూ వెనుక నుంచి మసక కాంతి కనిపించింది. ముందుగా ఆకాశాన్ని తాకేంత ఎత్తులోని తుపాన్ ‘ఐ వాల్’ విస్తృత వలయంలో వక్రీభవనంలా కనిపించింది. తుపాన్ వాయవ్య అంచున ప్రకాశించే ఓ వెలుగు వలయం కనిపించింది. అక్కడ నుంచి సూర్యకాంతి తుపాన్ అంచును దాటి లోపలికి చొచ్చుకురావడం వీడియోలో కనిపిస్తోంది.