Dream11: రియల్ మనీ గేమ్స్ నుంచి కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న డ్రీమ్ 11

Dream11 Entering New Business Real Money Games to Stock Broking
  • స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలోకి అడుగు పెట్టనున్న డ్రీమ్ 11
  • లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు
  • 26 కోట్ల మంది యూజర్లను కలిగిన డ్రీమ్ 11
ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 సరికొత్త రంగంలోకి ప్రవేశించనుంది. స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. 'డ్రీమ్ మనీ' పేరుతో స్టాక్ బ్రోకింగ్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు కారణంగా డ్రీమ్ 11 తన రియల్ మనీ గేమ్స్‌ను నిలిపివేసింది. దీని ఫలితంగా కంపెనీ ఆదాయం 95 శాతం వరకు క్షీణించింది. ఈ నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్ సేవలను అందించడం ద్వారా నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తోంది. డ్రీమ్ 11కు ప్రస్తుతం 26 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, వారిని రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ వైపు మళ్ళించాలని కంపెనీ యోచిస్తోంది.

గతంతో పోలిస్తే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సులువుగా మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉండటం, జీరో కమీషన్ ట్రేడింగ్ వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయినప్పటికీ, ప్రతి 12 మందిలో ఒక్కరు మాత్రమే ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఇంకా చాలా మంది మార్కెట్‌కు దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో, వారిని ఆకర్షించడంపై డ్రీమ్ 11 దృష్టి సారించింది.
Dream11
Dream11 stock broking
Dream Money
fantasy sports platform
online gaming bill
stock market investment

More Telugu News