Vladimir Putin: ట్రంప్ కు పుతిన్ షాక్.. ఫ్లుటోనియం ఒప్పందం రద్దు

Putin cancels Plutonium deal with US amid Ukraine tensions
  • 2016 లో ఒబామా హయాంలోనే ఈ ఒప్పందం నిలిపివేసిన పుతిన్
  • తాజాగా ఈ ఒప్పందాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ సంతకం
  • ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో పుతిన్ పై ట్రంప్ ఆగ్రహం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గట్టి షాకిచ్చారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపేయాలన్న తన సూచనను పెడచెవిన పెట్టాడని పుతిన్ పై ట్రంప్ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికాతో గతంలో రష్యా కుదుర్చుకున్న ప్లుటోనియం ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారు. దీనికి సంబంధించిన చట్టంపై తాజాగా పుతిన్ సంతకం చేశారు. ఈ పరిణామం మళ్లీ అణు ఉద్రిక్తతలకు దారితీస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఒబామా హయాంలోనే..
2000 సంవత్సరంలో అమెరికా, రష్యాల మధ్య ప్లుటోనియం నిర్వహణపై ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2010లో ఈ ఒప్పందాన్ని సవరించారు. దీని ప్రకారం.. రష్యా తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్‌ టన్నుల ప్లుటోనియంను అణ్వాయుధాల తయారీకి వాడకూడదు. ఈ నిల్వలను పౌర అణు విద్యుత్‌ తయారీ కోసం వినియోగించుకోవాలని ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో దాదాపు 17 వేల అణ్వాయుధాల తయారీని అడ్డుకున్నట్లు అప్పట్లో అమెరికా అధికారులు పేర్కొన్నారు. అయితే, ఒబామా హయాంలో 2016 సంవత్సరం అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్లుటోనియం ఒప్పందాన్ని పుతిన్‌ నిలిపివేశారు. తాజాగా ఈ అగ్రిమెంట్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు.
Vladimir Putin
Russia
Donald Trump
Plutonium agreement
US Russia relations
Nuclear weapons
Ukraine war
Nuclear energy
International relations
USA

More Telugu News