తుపాన్ ఎఫెక్ట్ తో కాకినాడ జిల్లాలో స్కూళ్లు, కాలేజీల బంద్.. 31 వరకు సెలవులు
- కాకినాడ వద్ద తీరం దాటనున్న మొంథా తుపాన్
- తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు
- తుపాన్ ప్రభావంతో కాకినాడలో భారీ వర్షాలు
తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఈ నెల 31 వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసేయాలని ఆదేశించారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు, రేపు విద్యాసంస్థలకు అధికారులు సెలువులు ప్రకటించారు. వర్షాల పరిస్థితిని గమనించి సెలవులు పొడిగించాలా లేదా అని నిర్ణయం తీసుకుంటారు.