Uttarakhand Villages: బంగారు నగలు ధరించడంపై ఆంక్షలు.. ఉత్తరాఖండ్ గ్రామస్థుల వింత నిర్ణయం

Uttarakhand Villages Fine for Wearing Excess Gold Jewelry
  • శుభకార్యాల్లో 3 నగలకన్నా ఎక్కువ ధరిస్తే 50 వేల జరిమానా
  • చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రంతో సరిపెట్టాలని కట్టుబాటు
  • గ్రామంలో జరిగే శుభకార్యాల్లో ఆడంబరాలు, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ముఖ్య ఉద్దేశం
శుభకార్యాల్లో రకరకాల నగలను ధరించి మహిళలు మురిసిపోతుంటారు. ఇతరులు ధరించిన కొత్తకొత్త డిజైన్లను చూసి తాము కూడా అలాంటి నగను చేయించుకోవాలని ఆశపడుతుంటారు. ఉన్నంతలో ఆడంబరంగా తయారై శుభకార్యాల్లో పాల్గొంటారు. కానీ ఉత్తరాఖండ్ లోని రెండు గ్రామాల్లో మాత్రం మహిళలు సింపుల్ గా ‘ఓ ముక్కు పుడక, చెవి కమ్మలు, మంగళసూత్రం’ మాత్రమే ధరించాలట. ఒంటిమీద అంతకుమించి ఒక్క నగ ఎక్కువ కనిపించిందా.. ఇక అంతే.. గ్రామ పెద్దలు ఆ మహిళ కుటుంబానికి రూ.50 వేలు జరిమానా విధిస్తారు.

ఇదెక్కడి వింత, ఇష్టపడి కొనుక్కున్న నగలను ధరించినా తప్పేనా అనుకుంటున్నారా.. ప్రపంచంలో మిగతా ఎక్కడైనా తప్పుకాకపోవచ్చు కానీ డెహ్రాడూన్‌ జిల్లాలోని కందద్, ఇంద్రోలి గ్రామాల్లో మాత్రం ముమ్మాటికీ అది తప్పే. ఎందుకంటే, ఈ రెండు గ్రామాల ప్రజలు ఉమ్మడిగా పెట్టుకున్న కట్టుబాటు అది. 

గ్రామంలో ఆడంబరాలను అరికట్టడం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు గ్రామస్తులందరూ సమష్టిగా తీసుకున్న నిర్ణయమిది. దీని ప్రకారం ఇకపై ఈ రెండు గ్రామాల్లో జరిగే ఏ శుభకార్యానికైనా మహిళలు సింపుల్ గా చెవి కమ్మలు, ముక్కు పుడక, మంగళసూత్రంతో మాత్రమే వెళ్లాలి. కాగా, గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ రెండు గ్రామాల మహిళలు స్వాగతించడం విశేషం.

Uttarakhand Villages
Uttarakhand
Kandad village
Indroli village
Jewellery restrictions
Jewellery ban
Dehradun
Village rules
Indian culture

More Telugu News