Sai Priya: ఆన్‌లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్.. సాయిప్రీతి పేరుతో రూ. 10 లక్షలు మోసం

Sai Priya Online Trading Fraud Hyderabad Man Loses 10 Lakhs
  • హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
  • సాయిప్రీతి పేరుతో చాటింగ్ చేసి డబ్బలు వసూలు
  • ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు రూ. 10 లక్షల మేర మోసగించారు. సాయిప్రీతి అనే పేరుతో చాటింగ్ చేస్తూ అతడి నుంచి భారీగా సొమ్ము కాజేశారు. లంగర్‌హౌస్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తితో సాయిప్రీతి పేరుతో సైబర్ నేరగాళ్లు చాటింగ్ చేశారు.

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించారు. బాధితుడు ఆ మొత్తాన్ని విడతల వారీగా పెట్టుబడి పెట్టాడు. మంచి లాభాలు రావడంతో ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించగా విఫలమయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Sai Priya
Online Trading Fraud
Hyderabad Cyber Crime
Cyber Fraud
Langer House
Online Investment Scam

More Telugu News