Kasturi: ఆ డైరెక్టర్ అప్పుడలా .. ఇప్పుడిలా: నటి కస్తూరి

kasturi Interview
  • నటిగా కస్తూరికి మంచి పేరు 
  • కెరియర్ తొలినాళ్ల గురించిన ప్రస్తావన 
  • కర్మ ఎవరినీ వదిలి పెట్టదని వ్యాఖ్య
  • ఎదిగినవారినీ .. పడిపోయినవారిని చూశానని వెల్లడి  
 
సీనియర్ హీరోయిన్ కస్తూరి, తెలుగులో కొన్ని సినిమాలు చేశారు. ఆ తరువాత సీరియల్స్ లోను ప్రధానమైన పాత్రలను పోషించారు. తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనం పాపాలు చేసినా .. ఇతరులను నొప్పించినా అందుకు తగిన ఫలితాన్ని తప్పక అనుభవించవలసి ఉంటుంది. అలాంటివారిని నేను ప్రత్యక్షంగా చూశాను కూడా" అని అన్నారు. 

"గతంలో చేసిన కర్మ ఫలాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాము. ఇప్పుడు మనం చేసే కర్మ ఫలాన్ని ఆ తరువాత అనుభవిస్తాము. నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక ఆడిషన్ కి వెళ్లాను. అంతకు ముందు ఒక హిట్ ఇచ్చిన దర్శకుడు, తన రెండో సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ఆడిషన్ కి నేను వెళ్లాను. నేను .. మా అమ్మ అక్కడే ఉన్నప్పటికీ అతను చాలాసేపు మా వైపు చూడను కూడా చూడలేదు. అలా అరగంటసేపు నిలబెట్టాడు. ఆ తరువాత నిదానంగా కళ్లు తెరిచి, ఫోటోలు తీసుకుని పంపించమని అక్కడివారితో చెప్పాడు" అని అన్నారు.       

" ఆ తర్వాత ఆ సినిమాలో నాకు కాకుండా వేరే హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు కూడా. నేను ఆ విషయాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే మూడేళ్ల క్రితం ఆ డైరెక్టర్ కాల్ చేశాడు. తాను ఎవరన్నది నాకు గుర్తు చేశాడు. ఒక 5 వేలు ఫోన్ పే చేయమని అడిగాడు. ఎందుకు అని నేను అడగలేదు. ఆయన ఏ పరిస్థితులలో ఉన్నారనేది నాకు అర్ధమైంది. అలా అహంభావంతో మిడిసిపడినవారిని చూశాను. సింపుల్ గా ఉంటూ ఎదిగినవారిని కూడా చూశాను" అని చెప్పారు.

Kasturi
Kasturi interview
Telugu actress Kasturi
Karma siddhantam
Director audition
Telugu movies
Big TV interview
Karma theory
Film industry struggles
PhonePe request

More Telugu News