Marco Rubio: భారత్, అమెరికా బంధంపై ఆ దేశ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- పాకిస్థాన్ తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు వెల్లడి
- అందుకోసం భారత్ తో బంధాన్ని బలిపెట్టలేమని వ్యాఖ్య
- భారత్, చైనా బంధాన్ని గుర్తుచేసిన మార్కో రూబియో
భారత్, పాకిస్థాన్ లతో అమెరికా బంధం గురించి అగ్రరాజ్యం విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు ఇటీవల అమెరికా మరింత దగ్గరవుతున్న సంగతి గుర్తుచేస్తూ విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పాక్ తో సన్నిహిత సంబంధాల కోసం అమెరికా ప్రయత్నిస్తున్న విషయం నిజమేనన్నారు. అయితే, పాక్ కు మరింత దగ్గరయ్యేందుకు భారత్ తో బంధాన్ని ఫణంగా పెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. భారత్ అమెరికాల మధ్య ఉన్న స్నేహ బంధం చారిత్రాత్మకమైందని, అత్యంత ప్రాముఖ్యత కలిగినదని చెప్పారు. భారత్, పాక్.. ఇరు దేశాలతోనూ తాము వ్యూహాత్మక సంబంధాలను కోరుకుంటున్నామని ఆయన వివరించారు.
పాక్, అమెరికా బంధం భారత్ తో అగ్రరాజ్యం సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన వివరించారు. ఏ దేశ విదేశాంగ విధానంలోనైనా ఇది సహజమేనని చెప్పారు. పాకిస్థాన్ ను భారత్ దూరంపెట్టిందని అమెరికా కూడా పాక్ కు దూరంగా ఉండాలని కోరుకోవడం సబబు కాదన్నారు. ఆ మాటకొస్తే అమెరికా దూరం పెట్టిన చైనాకు ఇటీవల భారత్ దగ్గరవుతోందని రూబియో గుర్తుచేశారు. భారతీయులు పరిణతి కలిగిన వారని, పాక్ తో అమెరికా బంధాన్ని అర్థం చేసుకుంటారని రూబియో వ్యాఖ్యానించారు.