Somireddy Chandramohan Reddy: ఒకప్పుడు బాలకృష్ణ అభిమానిగా బ్యానర్లు మోసినోడు ఇప్పుడు చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు: జగన్ పై సోమిరెడ్డి ఫైర్

Somireddy Chandramohan Reddy Fires at Jagan Mohan Reddy
  • జగన్ రెడ్డి ప్రవర్తనలో స్పష్టమైన తేడా కనిపిస్తోందన్న సోమిరెడ్డి
  • అసెంబ్లీకి రాని వ్యక్తి రెండున్నర గంటలు ప్రెస్ మీట్ పెట్టాడని వ్యాఖ్యలు
  • అన్నీ పచ్చి అబద్ధాలు చెప్పి రికార్డు సృష్టించాడని వ్యంగ్యం 
  • జగన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించాలని సలహా
టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రవర్తనలో స్పష్టమైన తేడా కనిపిస్తోందని, ఆయనకు వెంటనే వైద్యం చేయించాలని సలహా ఇచ్చారు. 

"జగన్ లో ఏదో తేడా కనిపిస్తోంది. భారతమ్మా.. వెంటనే ట్రీట్మెంట్ చేయించండి. జగన్ రెడ్డిలో నాకు ఏదో స్పష్టమైన తేడా కనిపిప్తోంది. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలు మోసినోడు... ఇఫ్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలి... కానీ ఆ దమ్ము లేదు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు. 

రెండున్నర గంటలు ఆపకుండా అబద్ధాలతో ప్రెస్ మీట్ నిర్వహించే రాజకీయ నాయకుడు దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఉండరేమో! పబ్లిక్ మీటింగుల్లో ఒక గంట స్పీచ్ ఇచ్చే వారిని చూశాం కానీ... ఇలా ప్రెస్ పెట్టే వారిని ఎప్పుడూ చూడలేదు. అరగంట అసెంబ్లీలో కూర్చోలేని పెద్దమనిషి ప్రెస్ మీట్లో రెండున్నర గంటలు కూర్చుంటాడు. జగన్ రెడ్డిలో చాదస్తం పెరగడం కాదు... కచ్చితంగా ఏదో తేడా ఉంది. ఆపకుండా రెండున్నర గంటలు ఒక్క నిజం లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడి రికార్డు సృష్టించాడు.

కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా సాధిస్తే తన బ్లూ మీడియాలో వ్యతిరేకిస్తాడు... ఆ మరుసటి రోజు అది తెచ్చింది తానే అంటాడు. ఇలాంటి రాజకీయ నాయకుడిని గత 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. జగన్ రెడ్డి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్... తల్లి, చెల్లి ఆయనకు దూరంగా ఉన్నారు. కనీసం భారతమ్మ అయినా ఆసుపత్రికి తీసుకెళ్లి బ్రెయిన్ టెస్ట్ చేయించాలి. నాకైతే మాత్రం ఆయనలో ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే మంచి ట్రీట్మెంట్ చేయించాలని నా సలహా" అంటూ సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
Somireddy Chandramohan Reddy
Jagan Mohan Reddy
TDP
YCP
Andhra Pradesh Politics
Nandamuri Balakrishna
Tadepalli Palace
Political Criticism
Telugu Desam Party
YS Jagan

More Telugu News