Harshit Rana: మూడో వన్డేకు ముందు హర్షిత్ రాణాకు గంభీర్‌ వార్నింగ్

Harshit Rana Gambhir Warning on Performance
  • సిడ్నీ మ్యాచ్ కు ముందు హర్షిత్ ప్రదర్శనపై అసంతృప్తి
  • సరిగ్గా ఆడకపోతే జట్టులో చోటు కోల్పోతావని హెచ్చరిక
  • మీడియాకు వెల్లడించిన రాణా చిన్ననాటి కోచ్‌ శ్రవణ్‌
ఆసియా కప్‌లో అంతంతమాత్రంగానే రాణించిన బౌలర్ హర్షిత్ రాణాను ఆస్ట్రేలియాతో వన్డే జట్టులోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే, అప్పుడు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అతడిని వెనకేసుకొచ్చి మీడియా, విశ్లేషకులకు కౌంటర్లు ఇచ్చాడు. కానీ, ఆసీస్‌ టూర్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతంత మాత్రంగానే రాణించడంతో.. ఇక లాభం లేదనుకొని రాణాను తీవ్రంగా హెచ్చరించాడు. ఈ విషయాన్ని హర్షిత్‌ తనకు మ్యాచ్‌కు ముందు ఫోన్‌ చేసి వెల్లడించాడని శ్రవణ్‌ తెలిపాడు.

శ్రవణ్ ఏమన్నాడంటే..
‘మ్యాచ్‌కు ముందు హర్షిత్‌ నాకు ఫోన్‌ చేశాడు. తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కొందరు క్రికెటర్లు కోచ్‌ గంభీర్‌కు హర్షిత్‌ దగ్గరి వ్యక్తి అని చెబుతుంటారు. కానీ, ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తించి.. వారికి గంభీర్‌ మద్దతుగా ఉంటాడు. వాస్తవానికి ఆయన హర్షిత్‌ను తీవ్రంగా మందలించాడు. మ్యాచ్ లో రాణించకపోతే జట్టు బయట కూర్చోబెడతానని నేరుగా హర్షిత్‌ కే చెప్పాడు’ అని శ్రవణ్‌ పేర్కొన్నాడు.
Harshit Rana
Gautam Gambhir
Asia Cup
Australia tour
Indian Cricket Team
Cricket
Sravan
Cricket Coach
Team Selection
Gambhir Warning

More Telugu News