Pradeep Ranganathan: 30 కోట్ల సినిమాకి ఓటీటీ రైట్స్ 25 కోట్లు!

Dude Movie Update
  • ప్రదీప్ రంగనాథన్ నుంచి 'డ్యూడ్'
  • కీలకమైన పాత్రలో మమితా బైజూ 
  • యూత్ ను ఆకట్టుకున్న కంటెంట్ 
  • 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమా
  • నెట్ ఫ్లిక్స్ చేతికి ఓటీటీ హక్కులు   

ప్రదీప్ రంగనాథన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు డిఫరెంట్ గా ఉండటమే అందుకు కారణం. ఆయన నుంచి వచ్చిన 'లవ్ టుడే' .. 'డ్రాగన్' సినిమాలు హిట్ కొట్టడం మరో కారణం. రీసెంటుగా ఆయన నుంచి వచ్చిన 'డ్యూడ్' సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమాలో ఆయన జోడీగా మమితా బైజూ సందడి చేసింది. 

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ తమిళ సినిమా, ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఓ మాదిరిగా ఆడొచ్చు అనే చాలామంది అనుకున్నారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక మరో విశేషం ఏమిటంటే, 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఓటీటీ హక్కులు 25 కోట్లు పలకడం. 

ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. కథ విషయానికి వస్తే, హీరో తన మేనమామ కూతరును ప్రేమిస్తాడు .. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆల్రెడీ ఆమె వేరొకరిని ప్రేమించినట్టుగా తెలుస్తుంది. అతని కారణంగా గర్భవతి అయిందని తెలుస్తుంది. అధికారికంగా వాళ్లిద్దరూ ఒకటయ్యేవరకూ, ఆమెను తాను పెళ్లి చేసుకోవలసి వస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ.

Pradeep Ranganathan
Dude movie
Love Today
Mamitha Baiju
Keerthyishwaran
Netflix OTT rights
Mythri Movie Makers
Tamil cinema
Sarath Kumar

More Telugu News