Telangana Inter Exams: తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచే ఇంటర్ పరీక్షలు
- గతేడాది కన్నా పది రోజుల ముందే ప్రారంభం
- ఈ ఏడాది పరీక్ష రాయనున్న 9.5 లక్షల మంది విద్యార్థులు
- ప్రాక్టికల్ పరీక్షలకు 4.2 లక్షల మంది
తెలంగాణలో ఈసారి ఇంటర్ పరీక్షలు ముందే జరగనున్నాయి. గతేడాది కన్నా పది రోజుల ముందే పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజా వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఈ రోజు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇంటర్ పరీక్షల తేదీలతో పాటు సిలబస్‌లోనూ మార్పులు చేసినట్లు తెలిపారు.
ఫస్టియర్ లో ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఇంటర్నల్ పరీక్షలకు 20, ఎక్స్‌టర్నల్ పరీక్షలకు 80 మార్కులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు ప్రతిఏటా సుమారు 4.20 లక్షలకు పైగా విద్యార్థులు అటెండ్ అవుతుంటారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంది. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలను గవర్నమెంట్ కాలేజీలలోనే నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుగుణంగా ఇంటర్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ ను రెడీ చేసింది.