Nirmal district: నిర్మల్ జిల్లాలో అమానుషం .. ఆరో తరగతి విద్యార్థిపై సీనియర్ల లైంగిక దాడి

Student sexual assault in Nirmal district BC hostel
  • బీసీ సంక్షేమ హాస్టల్‌లో దారుణ ఘటన
  • అర్ధరాత్రి బాలుడిని బయటకు తీసుకెళ్లి అఘాయిత్యం
  • బాధితుడి టీసీ తీసుకుని వెళ్లిపోయిన కుటుంబసభ్యులు
  • నిందిత విద్యార్థులకు టీసీలిచ్చి పంపేసిన యాజమాన్యం
  • ఘటనపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు
నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖానాపూర్ మండలంలోని మస్కాపుర్ బీసీ సంక్షేమ విద్యార్థి వసతి గృహంలో చోటుచేసుకుంది.

మస్కాపుర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్థానిక బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడిని నిద్రలేపారు. వసతి గృహం పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం గురించి బాధితుడు తన కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాఠశాలకు వచ్చి తమ కుమారుడికి టీసీ తీసుకుని, హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి తీసుకెళ్లారు.

మరోవైపు, ఈ విషయాన్ని తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోనగిరి నరేందర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన హాస్టల్ వార్డెన్ ప్రకాశ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి జరిగిన ఘటనను వివరించారు. ఆ తర్వాత ఈ నెల 23న వారిద్దరికీ టీసీలు ఇచ్చి పాఠశాల నుంచి పంపించివేశారు. ఈ వసతి గృహంలో, పాఠశాలలో ఇలాంటి ఘటనలు గతంలోనూ పలుమార్లు జరిగాయని, కానీ యాజమాన్యం వాటిని బయటకు పొక్కకుండా తొక్కిపెడుతోందన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
Nirmal district
minor rape case
student sexual assault
Telangana school
BC welfare hostel
Khanapur mandal
Maskapur school
school harassment
crime news

More Telugu News