Kurnool bus accident: కర్నూలు బస్సు ప్రమాదం: 19 మృతదేహాల వెలికితీత.. ప్రాణాలతో బయటపడింది వీరే!

Kurnool Accident 19 Dead Few Passengers Escape Burning Bus
  • కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం
  • బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం
కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 19 మంది ప్రయాణికుల మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పూర్తిగా దగ్ధమైన బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు.

ఈ ఘోర ప్రమాదం నుంచి పలువురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. వారిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎం. సత్యనారాయణ, హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన జయసూర్య, హయత్‌నగర్‌కు చెందిన నవీన్‌ కుమార్‌, బెంగళూరుకు చెందిన సరస్వతీ నిహారిక ఉన్నారు. 

వీరితో పాటు నెల్లూరు జిల్లా కొత్తపేటకు చెందిన నీలకుర్తి రమేశ్‌, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె జస్విత, కుమారుడు అభిరామ్‌, అలాగే నెల్లూరుకే చెందిన కాపరి అశోక్‌, కాపరి శ్రీహర్ష ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు కూడా సురక్షితంగా ఉన్నారని, వారి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Kurnool bus accident
Kurnool
bus accident
Andhra Pradesh road accident
M Satyanarayana
Jayasoorya
Naveen Kumar
Saraswati Niharika
road accident India

More Telugu News