Bandla Ganesh: బండ్ల గణేశ్ సినిమాలు తీయకపోతే ఇండస్ట్రీకి ప్రమాదం: నిర్మాత ఎస్‌కేఎన్

SKN comments on Bandla Ganesh impact on Telugu film industry
  • ‘తెలుసు కదా’ చిత్ర సక్సెస్ మీట్‌లో ఆసక్తికర ఘటన
  • నిర్మాత బండ్ల గణేష్‌పై ప్రశంసలు కురిపించిన ఎస్‌కేఎన్
  • ఒక మేధావి మౌనంతో బండ్ల సైలెన్స్‌ను పోల్చిన వైనం
ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండటం తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రమాదకరమని మరో నిర్మాత ఎస్‌కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మేధావి మౌనంగా ఉంటే దేశానికి ఎంత నష్టమో, బండ్ల గణేశ్ లాంటి నిర్మాత సినిమాలు తీయకుండా ఉంటే ఇండస్ట్రీకి అంతే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.

సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెలుసు కదా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు బండ్ల గణేశ్, ఎస్‌కేఎన్ హాజరయ్యారు.

ఈ వేదికపై ఎస్‌కేఎన్ మాట్లాడుతూ బండ్ల గణేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బండ్ల గణేశ్ లాంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం. ఆయన కొత్త కాంబినేషన్లను ప్రయత్నిస్తూ, ప్రేక్షకులను ఉత్సాహపరిచే సినిమాలు తీస్తారు. అలాంటి వ్యక్తి నిర్మాణానికి దూరంగా ఉండటం ఇండస్ట్రీకి ప్రమాదం. ఆయన ఎప్పుడూ సినిమాలు తీస్తూ ముందుండాలి” అని ఎస్‌కేఎన్ అన్నారు.
Bandla Ganesh
SKN
Telugu film industry
Producer
Telusu Kada
Siddu Jonnalagadda
Srinidhi Shetty
Raashii Khanna
Neeraja Kona
People Media Factory

More Telugu News