Upasana: రామ్‌చరణ్-ఉపాసన దంపతుల సెలబ్రేషన్స్ ఎందుకో తెలుసా?
- మరోసారి తండ్రికానున్న రామ్‌చరణ్
- వీడియోను షేర్ చేసిన ఉపాసన
- దీపావళి రోజు జరిగిన వేడుక
- వైరల్‌గా మారిన క్యూట్ వీడియో
రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆనందానికి ఇప్పుడు అవధుల్లేవు. త్వరలో ఈ ఇద్దరూ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఈ దీపావళి మా ఇంట్లో ఆనంద దీపావళి. మా సంతోషాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసింది. అందరి ఆశీస్సులు, ఆశీర్వచనాలు మాకు అందాయి" అంటూ ఈ సంతోషకరమైన వార్తను ఉపాసన అందరితో పంచుకుంటూ ఒక మెమరబుల్ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో రామ్ చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులతో పాటు నాగేంద్రబాబు, నిహారిక కొణిదెల, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలతో పాటు పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు చిరు కుటుంబ సభ్యులతో పాటు అగ్ర కథానాయకులు వెంకటేష్, నాగార్జున, నయనతార ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. ఈ వీడియోలో వీరు కూడా ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు. దీపావళి రోజే ఈ వేడుక కూడా జరిగినట్లుగా వీడియో చూస్తే తెలుస్తుంది. 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023లో కూతురు (క్లీంకార) పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు.