Fauzi: 'ఫౌజీ'గా రానున్న ప్రభాస్.. బర్త్‌డే స్పెషల్‌గా టైటిల్ పోస్టర్ విడుదల

Prabhas Fauzi Title Poster Released on Birthday
  • ప్రభాస్-హను రాఘవపూడి సినిమాకు టైటిల్ ఖరారు
  • 'ఫౌజీ'గా పేరును ప్రకటించిన చిత్రబృందం
  • ప్రభాస్ 46వ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన
  • 1940ల నాటి చారిత్రక యాక్షన్ చిత్రంగా 'ఫౌజీ' 
  • ప‌వ‌ర్‌ఫుల్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేయగా, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.

గురువారం ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాణ సంస్థ ఈ ప్రకటన చేసింది. "చరిత్రలోని మరుగునపడిన అధ్యాయాల నుంచి వస్తున్న ఒక సైనికుడి సాహస గాథ ఇది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ప‌వ‌ర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన వెనుక బ్రిటిష్ జెండా మంటల్లో కాలిపోతున్న దృశ్యం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

1940ల కాలం నాటి చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన కథానాయికగా ఇమాన్వి నటిస్తున్నారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలు ఉండటంతో సెట్స్ నుంచి ఏ చిన్న విషయం బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంటోంది.

'సీతారామం' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కృష్ణకాంత్ పాటలు రాస్తున్నారు. ఈ భారీ చారిత్రక చిత్రానికి షీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Fauzi
Prabhas
Prabhas Fauzi
Hanu Raghavapudi
Mythri Movie Makers
Fauji movie
Imanv
Vishal Chandrasekhar
Telugu movies
Historical drama
Anupam Kher

More Telugu News