Chandrababu Naidu: దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu Visits Dubai Future Museum
దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించిన సీఎం 
దుబాయ్ లో బిజీబిజీగా సీఎం చంద్రబాబు 
యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంత్రులు, అధికారులతో కలిసి దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించారు. దీనిని లివింగ్ మ్యూజియంగా రూపొందించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ వంటి రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది టెక్నాలజీని ఉపయోగించి మ్యూజియంలో ప్రదర్శనలు చేస్తున్నట్లు అక్కడి అధికారులు చంద్రబాబు బృందానికి వివరించారు. ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్‌లోని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు. విశాఖలో నవంబర్‌లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. 
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Dubai Future Museum
UAE Tour
Investments
Partnership Summit Visakhapatnam
Future Technology
Artificial Intelligence

More Telugu News