Gurajala Chandu: మైనర్ బాలికపై అత్యాచారం.. 32 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పు

Gurajala Chandu gets 32 years jail in minor rape case
  • తీర్పు వెలువరించిన నల్గొండ జిల్లా పోక్సో న్యాయస్థానం
  • మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడు
  • జైలు శిక్షతో పాటు రూ. 75 వేల జరిమానా విధింపు
తెలంగాణ రాష్ట్రంలోని పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడు గురజాల చందుకు 32 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

2022లో నల్గొండ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి స్థానిక పోక్సో కోర్టులో వాదనలు జరిగాయి. నేడు కోర్టు ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెలువరించారు. 32 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 75 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని తీర్పులో పేర్కొన్నారు.
Gurajala Chandu
Nalgonda
POCSO Act
Telangana
Minor girl rape case
Kidnapping
Sexual assault

More Telugu News