Kapila Theertham: పరవళ్లు తొక్కుతున్న తిరుపతి కపిలతీర్థం.. పోటెత్తిన పర్యాటకులు, స్థానికులు

Kapila Theertham Tirupati Attracts Tourists with Overflowing Waterfalls
  • శేషాచలం అడవుల నుంచి భారీగా చేరుతున్న వరద నీరు
  • తిరుమల భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారిన జలధారలు
  • సెల్ఫీలు, ఫొటోలతో సందర్శకుల సందడి
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కపిలతీర్థం జలకళను సంతరించుకుంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఇక్కడి జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొండలపై నుంచి ఉద్ధృతంగా జాలువారుతున్న జలధారలు చూపరులకు కనుల పండుగ చేస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

శేషాచలం కొండల నుంచి వస్తున్న నీటితో కపిలేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న జలపాతం నిండుగా ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు సైతం కపిలతీర్థాన్ని సందర్శించి, జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా యువత, కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న సందర్శకులు ఉత్సాహంగా గడుపుతున్నారు.

ఈ అపురూప దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. జలపాతం ముందు నిల్చొని సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. పర్యాటకుల రాకతో కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. 
Kapila Theertham
Tirupati
Kapila Theertham waterfalls
Seshachalam hills
Tourists
Local people
Lord Venkateswara
Kapileswara Swamy Temple
Waterfalls
Tirumala

More Telugu News