Viral Video: సపోటా తోటలో దారుణం.. బాలికను కాపాడిన స్థానికులు

Minor Girl Rescued from Alleged Sexual Assault by TDP Leader Tatik Narayana Rao
  • కాకినాడ జిల్లా తునిలో వెలుగులోకి వచ్చిన దారుణం
  • మైనర్ బాలికపై టీడీపీ నేత లైంగిక దాడికి యత్నం
  • సపోటా తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యం
  • గమనించి బాలికను కాపాడిన స్థానికులు
  • నిలదీస్తే ‘నేను కౌన్సిలర్‌ను’ అంటూ బెదిరింపులు
  • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
కాకినాడ జిల్లా తునిలో దారుణమైన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీకి చెందిన ఓ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించగా, స్థానికులు గమనించి అడ్డుకున్నారు. నిందితుడిని నిలదీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. తుని రూరల్‌లోని ఓ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను, స్థానిక టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను సమీపంలోని హంసవరం సపోటా తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ సమయంలో బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బాలికను అతని చెర నుంచి కాపాడారు.

ఈ ఘటనపై స్థానికులు నారాయణరావును గట్టిగా నిలదీయగా, బాలిక మూత్ర విసర్జన కోసం ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో "నేనెవరో తెలుసా? నేను టీడీపీ కౌన్సిలర్‌ను. నన్నే ప్రశ్నిస్తారా? తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ వారిని బెదిరించారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Viral Video
Tatik Narayana Rao
TDP Leader
Minor Girl
Sexual Assault Attempt
Tuni
Kakinada District
Andhra Pradesh Crime
Hamsavaram
Sapota Garden
Gurukul School

More Telugu News